SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, గీతం యునివర్సిటీ వద్ద జిల్లా పోలీసులు, కేంద్ర బలగాలు 500 మంది పోలీసులతో మూడంచెల విధానంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..
• కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. జిల్లా అదనపు.ఎస్పీ డా పి.అశోక్
సంగారెడ్డి జిల్లాలోని 5-నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఆదివారం తేది: 03.12.2023 నాడు ఉదయం 8 గంటల నుండి గీతం ఉనివర్సిటీ, రుద్రారం నందు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ట్రాఫిక్, భద్రత పరమైన సమస్యలు తలెత్తకుండా ఆర్ముడ్ రిజర్వ్, స్థానిక పోలీస్ బలగాలు 500 మందితో మూడంచెల విధానంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు అదనపు.ఎస్పీ వివరించారు.


ఈ సందర్భంగా అదనపు.ఎస్పీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రత పరమైన అంశాలను పరిశీలిస్తూ, కౌంటింగ్ బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు… కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే వారికి, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నియోజకవర్గాల వారిగా కేటాయించిన పార్కింగ్ ఏరియాలలో వాహనాలను పార్కింగ్ చేసే విధంగా చూడాలన్నారు. మోబైల్ ఫోన్లు, అగ్గిపెట్టెలు, బాణాసంచా, లైటర్ల వంటి నిషేధిత పేలుడు పదార్థాలు కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకొని రాకుండా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల లోపల, బయట పరిసరాలు అన్ని సీసీ కెమెరాల నిఘా నేత్రంలో ఉంటాయని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సంఘవిద్రోహ శక్తులెవరైన కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించాలని చూసినట్లయితే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు.


జిల్లా వ్యాప్తంగా తేదీ: 03-12-2023 ఉదయం 6:00 నుండి తేదీ: 04-12-2023 ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా అదనపు.ఎస్పీ తెలిపారు.. కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు కానీ అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, గుర్తులు, ఫ్లాకార్డ్స్ ధరించవద్దు ప్రదర్శించవద్దని, మైకులు, లౌడ్ స్పీకర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులకు, అనుమతి లేదన్నారు. ఎన్నికల కౌటింగ్ పక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని, రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని, గుర్తింపు కార్డ్ లను కలిగి ఉన్నవారిని మాత్రమే కౌంటీగ్ కేంద్రలోకి అనుమతించడం జరుగుతుందన్నారు.

Whatsapp Image 2023 12 02 At 6.42.57 Pm

SAKSHITHA NEWS