SAKSHITHA NEWS

నీటిని పొదుపుగా వాడాలి.

పోలింగ్ కేంద్రాల పరిశీలన – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

……..

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: త్రాగునీటికి నిధుల కొరత ఉండదని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని బతుకమ్మ చౌరస్తా వద్ద ఫిల్టర్ బెడ్, వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులకు త్రాగునీటి కొరత లేకుండా మే మాసంలో నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు వివరించాలని సూచించారు. పట్టణంలోని సుమారు ఒక లక్షా 66 వేల మంది జనాభా ఉన్నందున వార్డుల్లో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా వచ్చే మే మాసంలో స్పేషల్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం నీటి లభ్యత, డిమాండ్ ప్రకారం త్రాగునీటిని ప్రజలకు అందించాలని అలాగే వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక అధికారులు కూడా వారికి కేటాయించిన వార్డుల ప్రకారం పరిశీలన చేసి నివేదికలు అందించాలని సూచించారు. పులిచింతలలో లోలేవల్ కి నీరు చేరడంతో హుజూర్ నగర్ నియోజక వర్గంలో మట్టపల్లి, కృష్టాపురం ప్రాంతాల్లో మే నెలలో నీటి ఎద్దడి వచ్చే అవకాశాలు ఉన్నందున వ్యవసాయ బావులు, బోరు బావులు నీటిని వినియోగంలోకి తేవాలని 90 అవాసాలలో నీటి సరఫరా పై మిషన్ భగీరథ ఇంజనీర్లతో ఈ సందర్బంగా చర్చించారు. తదుపరి సూర్యాపేట లోని పాత వ్యవసాయ మార్కెట్ వద్ద గల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో గల 84,85 పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు, లైటింగ్ అలాగే ఇతర మౌలిక వసతులు పరిశీలించారు. అదేవిదంగా 84 వ కేంద్రం పరిధిలో 889 ఓటరు స్లిప్పులకు గాను 455 ఓటర్ స్లిప్పులు బి.ఎల్.ఓ లు అందచేసారని మిగిలిన ఈ రోజు అందచేయాలని సూచిస్తూ ఫోన్ ద్వారా ఓటర్ స్లిప్పులపై కలేక్టర్ వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈ.ఈ అరుణాకర్ రెడ్డి, డి.ఈ రాజేందర్, ఏ.ఈ వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 30 at 5.11.14 PM

SAKSHITHA NEWS