నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు – ఎస్సై ధర్మ

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్.ఐ ఎన్. ధర్మ తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాలతో ఎస్. ఐ ఎన్.ధర్మ మండల వ్యవసాయ అధికారి గిరిబాబు తో కలిసి విత్తనాలు అమ్మే పలు షాపులను తనిఖీ చేశారు. అందులో భాగంగా రఘురామా ట్రేడర్స్ లో విత్తనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఐ ధర్మ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీలర్లను హెచ్చరించడం జరిగింది. ఈరోజు నుండి ఎవరైనా నకిలీ విత్తనాలు వేరే ప్రదేశాల నుండి తీసుకువచ్చి రైతులకు అమ్మినచో చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా చిట్యాల మండలంలోని రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఎవరైనా తక్కువ ధరలలో ప్యాక్ చేయని లూజు విత్తనాలు అమ్మినట్లయితే మోసపోకుండా మండల వ్యవసాయ అధికారికి గాని చిట్యాల పోలీసు వారికి గాని వెంటనే తెలియజేయాలని అన్నారు. ఈ వాన కాలంలో చిట్యాల మండలంలో రైతులందరికీ 100 శాతం నాణ్యమైన విత్తనాలను అందే విధంగా చర్యలు తీసుకోవ డానికి వ్యవసాయ శాఖ అధికారులు పోలీస్ యంత్రాంగంతో జత కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు.

Related Posts

You cannot copy content of this page