SAKSHITHA NEWS

గద్వాల:-డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు అని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రం లోని ట్రాఫిక్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ రవి ఆదేశాల మేరకు వివిధ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 22మంది కి గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మద్యం తాగి పట్టుబడిన వారికీ తాగి వాహనం నడపటం ద్వారా జరిగే దుష్ప్రభావాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ సందర్బంగా ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ… మధ్యం సేవించి వాహనాలు తీసేటప్పుడు వాహనదారులు వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఒక్కసారి ఆలోచించాలని ఏదైనా ప్రమాదం జరిగి,ఇబ్బందులు పడే కంటే ఎవరూ తాగి వాహనాలు నడపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ఆయన కౌన్సెలింగ్ ద్వారా వాహనదారులకు తెలిపారు.మళ్లీ ఇదే విధంగా తాగి వాహనాలు నడిపి దొరికినట్లు అయితే వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్సై హెచ్చరించారు.పట్టణం లోని వాహనదారులు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఇక నుండి ప్రతి రోజు గద్వాల పట్టణంలో ఏదో ఒక ప్రదేశంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 13 At 3.16.44 Pm

SAKSHITHA NEWS