SAKSHITHA NEWS

Strict action will be taken against anyone who behaves out of bounds. Kurnool District SP

హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవు .కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్


సాక్షిత కర్నూలు జిల్లా. : మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి .
డిసెంబర్ 31 వ తేది రాత్రి జిల్లా అంతటా పోలీసు పెట్రోలింగ్. యువకులకు వారి తల్లిదండ్రులు సత్రవర్తనతో మెలగాలని సూచించండి.నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి.డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

జిల్లాలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని పోలీసుఅధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు డిసెంబర్ 31 వ తేది రాత్రి మద్యం షాపులు, బార్లు, హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్ధలు నిర్ణీత సమయాల్లోనే కచ్చితంగా మూసేయాలన్నారు.రహదారులపై కేక్ కటింగ్ లు చేయడం నిషేధమన్నారు.

మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా, అందుకు ఏర్పాట్లు సమకూర్చినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.
డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.

వీటితోపాటు బైక్ రేస్ లు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆ వాహనాలను సీజ్ చేసి , కఠిన మైన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.


పోలీసు బృందాలు, బ్లూ కోల్ట్, రక్షక్, స్పెషల్ పార్టీ పోలీసులు రాత్రి గస్తీ పై గట్టి నిఘా ఉంచుతారన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందరూ పోలీసు శాఖతో సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.


SAKSHITHA NEWS