మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్

Spread the love

Strange punishment for drug addicts.. 1000 times imposition by sitting in the station

మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్

మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మందుబాబులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అలానే తాగి వాహనాలను నడుపుతున్నారు. అయినా ఒకసారి సరే.. రెండు సార్లు సరే.. పోలీసులు వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు. పదే పదే తాగేసి తూలుతూ వాహనాల్లో తిరుగుతుంటే పోలీసులు ఊరుకుంటారా? మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళ పోలీసులు షాక్ ఇచ్చారు. మందుబాబులకు వార్నింగ్‌ ఇచ్చి, ఫైన్‌లు వేసి విసిగిపోయిన పోలీసులు వినూత్నంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టి శిక్ష విధించారు.

మందుకొట్టి వాహనాలు నడుపుతున్న వారితో.. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్‌ రాయించారు. కొచ్చిలో ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ‘ఇకపై తాగి డ్రైవింగ్‌ చేయను’ అని వారితో వెయ్యిసార్లు రాయించారు. మందుబాబులంతా చేసేది లేక పోలీస్ స్టేషన్‌లో నేల మీద కూర్చొని ఇంపోజిషన్ రాశారు. ఇంపోజిషన్‌ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు వెల్లడించారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులను సస్పెండ్ చేయనున్నామని చెబుతున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page