సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : గత 16 రోజులుగా హమాస్ ఉగ్రవాదుల పేరిట ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయి,లక్షలాదిమంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి శరణార్థులుగా బతకడం వారి జీవించే హక్కును నిరకరించడమేనని వెంటనే ఇజ్రాయిల్ పాలిస్తీనా పై చేస్తున్న దాడులను ఆపాలని నేడు మక్డుం నగర్ సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశం సందర్భంగా మాట్లాడారు.
ఒకనాడు ఇజ్రాయెల్ లేదని శరణార్థులుగా వచ్చి చిన్నచిన్నగా పాలిస్తీనా ను కబలిస్తూ పాలిస్తీనా పౌరులు తమ భూభాగంలో బతకనివ్వకుండా చెయ్యడం అన్యాయమని వెంటనే పాలిస్తీనా స్వతంత్రత ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి కూడా చెబుతున్నప్పటికీ అమెరికా మద్దత్తుతో ఇజ్రాయిల్ పాలిస్తీనా ను అక్రమించుకుంటు అనేకమంది ని చంపిన చరిత ఇజ్రాయిల్దని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పాలిస్తీనా కు మద్దత్తు ఉందని,కానీ నేడు మోడీ ఇజ్రాయిల్ పై ప్రేమను ఒలకబోస్తూ అమెరికా చేతుల్లో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ మన దేశ ఆలిన విధానాన్ని అమలు చెయ్యట్లేదని కావున ఇప్పటికైనా నిజం తెలుసుకొని పాలిస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ జాక్ నాయకులు తహెర్, మైనార్టీ నాయకులు హమీద్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ దాడులను అందరం ఏక కంటంగా కండిస్తూ, ఇజ్రాయిల్ పదార్థాలను వాడకుండా ఉంటే ఇశ్రాయేలు దెబ్బ తిని తోకముడుస్తుందని కావున భారతీయులు అందరు కలిసి ఇశ్రాయేలు చేస్తున్న దూరగతలకు వ్యతిరేకిస్తూ దాడులను కండిచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఖయుమ్, ఇమామ్,ఖాజా,జహంగీర్, సీపీఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్,నాయకులు ప్రభాకర్ లు పాల్గొన్నారు