ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలి.

ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలి.

SAKSHITHA NEWS

ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలి.

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఐడిఓసి ఆవరణలో నిర్మించనున్న ఇవిఎం గోడౌన్ నిర్మాణ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. రూ. 2.7 కోట్ల వ్యయ అంచనాలతో గోడౌన్ నిర్మాణం జరుగనున్నట్లు ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు భద్రతా, డిజైన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామప్రసాద్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రాంబాబు, ఏఇఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS