SAKSHITHA NEWS

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బలమల్లేష్.
పార్లమెంట్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం నియంతృత్వం చర్యలకు నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 22న తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులను జయప్రదం చేయాల్సిందిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేశ్ పేర్కొన్నారు.

గురువారం షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో జరిగిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎన్ బాలమల్లేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ ఇటీవల పార్లమెంటులో చోటు చేసుకున్న పొగబాంబు ఘటన పై సమగ్ర చర్చ జరగాలని దోషులను కఠినంగా శిక్షించాలని, దేశభద్రతను కాపాడాలని ప్రతిపక్షాలు కొడుతుంటే,దాని పై సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం చర్యలను ఖండించారు. బీజేపీ ప్రభుత్వ వైకిరి ఎండగొటుతూ నిలదిస్తున్న 143 మంది పార్లమెంట్ సస్పెండ్ చేయడాన్ని బాలమల్లేశ్ తీవ్రంగా ఖండించారు. దేశచరిత్రలో ఎన్నడు లేనివిధంగా పార్లమెంట్లో నిరంకుశంగా బీజేపీ వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామిక శక్తులు పెద్ద ఎత్తున జయప్రదం చెయ్యాలని కోరారు.
సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డి జి సాయిలు గౌడ్ ప్రసంగిస్తూ డిసెంబర్ 22వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం10 గంటలకు ధర్నా జరుగుతుందని, ధర్నాను జయప్రదం చెయ్యాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయిందని,వాటి రక్షణ కొరకు సీపీఐ తరపున పోరాటం సాగిస్తామని అన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భూమిని రక్షణ కొరకు సీపీఐ చేస్తున్న పోరాటాన్ని అభినందించారు, వారు చేసే పోరాటానికి జిల్లా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు.అర్హత కలిగిన పేదలకు డబుల్ బెదరూమ్ ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెబుతోందని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు దామోదర్ రెడ్డి, ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దశరథ్, లక్ష్మీ,శంకర్ రావ్, కృష్ణమూర్తి, శంకర్, వెంకటరెడ్డి,రచ్చ కిషన్,స్వామిలు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 21 at 3.12.28 PM

SAKSHITHA NEWS