నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం హైలెట్స్

Spread the love

సాక్షిత : రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది*
ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి*
వివిధ రకాల సర్టిఫికెట్లను సత్వరమే అందిస్తున్నాం*
గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి మొండి చేయి చూపించారు*
జన్మభూమి కమిటీల ద్వారా తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసేవారు
ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ అర్హులను ఎంపిక చేసి పథకాలను అందిస్తున్నారు*
వాలంటీర్లు సేవలందిస్తుంటే రాజకీయ అజ్ఞాని అయిన పవన్ కళ్యాణ్ వారిపై ఆరోపణలు చేయడం సరికాదు*
ఒకచోట ఏదైనా ఘటన జరిగితే వాలంటీర్లు అందరూ నేరం చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు*
నెల్లూరు జిల్లాకు సంబంధించి పంట నష్టపరిహారం కింద రూ.79 లక్షల మేర బీమా వచ్చింది*
కానీ జిల్లాలో కోటి 20 లక్షల మేర కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు*
. పచ్చ మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది*
ఒక గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఈ- కేవైసి లో చేసిన పొరపాటు కారణంగా ఇతరుల ఖాతాల్లో జమైంది*
ఆ మొత్తాన్ని కూడా అర్హులకు ఇప్పిస్తున్నాం*
ఇటీవల చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో మా పథకాలే ఉన్నాయి*
ప్రజలు కూడా ఈ విషయంపై ఆలోచిస్తున్నారు*
పవన్ కళ్యాణ్ కు తన పార్టీపై నమ్మకం లేదు.. అందుకే ఇతర పార్టీలతో కలుస్తున్నారు*
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెబుతున్న చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వచ్చేందుకు భయపడుతున్నారు*
చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో అప్పుడప్పుడు బిజెపిని కలిసి వస్తున్నారు
బిజెపి నేతలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల పై నమ్మకం లేదు*
ప్రభుత్వంపై వ్యతిరేకత కోసం పచ్చ మీడియా విష ప్రచారం చేస్తోంది*
మీడియా సమావేశానికి హాజరైన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ,నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ ,జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి , నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , ముత్తుకూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి , కార్పొరేటర్లు స్థానికులు, ప్రజాప్రతినిధులు తదితరులు*

Related Posts

You cannot copy content of this page