సాక్షిత : * సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత
దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు.
2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, కూతురు అక్షయ ఉన్నారు.
క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించిన ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి మృతి పట్ల సిబ్బంది సంతాపం తెలిపారు. మేడ్చల్ డీసీపీ సందీప్ ఆధ్వర్యంలో మేడ్చల్ జోన్ పోలీస్ సిబ్బంది కలిసి తమ వంతు సాయంగా రూ. 10 లక్షల జమ చేసి ఆ చెక్కు ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతులమీదుగా ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులైన ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మీప్రసన్న, తల్లి రమాదేవి, తండ్రి సాగర్ రెడ్డి కి అందజేశారు.
పోలీస్ శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా వచ్చేలా చూస్తామని సీపీ ఎస్ఐ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.
సీపీ వెంట మేడ్చల్ డీసీపీ సందీప్, మేడ్చల్ ఏసిపి వెంకట్ రెడ్డి, దుండిగల్ సిఐ రామకృష్ణ ఉన్నారు.
ఎస్ఐ కుటుంబానికి సిబ్బంది ఆర్థిక సాయం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…