SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 19 at 5.45.48 PM

సాక్షిత తిరుపతి : శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్ లో టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రైల్వే ఓవర్ బ్రిడ్జి పైన గడ్డర్స్ ఏర్పాటు తదితర పనుల ప్రక్రియ వేగవంతం చేసి ఆగష్టు 5 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి మున్సిపల్ కమీషనర్ హరితను కోరారు. రోడ్లకు ఇరువైపులా మీడియన్స్, డ్రైనేజి, డివైడర్లు, సుందరీకరణ, తారు రోడ్డు పనులను ఏకకాలంలో చేపట్టాలన్నారు. నిర్మాణ పనులకు అడ్డంకిగా వున్న భూగర్భంలోని విద్యుత్ వైర్లను తొలగించేందుకు తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి సంతోష్ రావును కోరారు. మీడియన్స్ ఏర్పాటు, కాలువలు, సెంట్రల్ డివైడర్లు, వీధుల ఆధునీకరణ, అవసమయిన చోట్ల పెయింటింగ్, ఎలక్ట్రికల్, మొక్కల పెంపక పనుల పురోగతికి సంబంధించి ఒక బార్ చార్ట్ ను ఏర్పాటు చేసుకొని, తదనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఆయన మున్సిపల్ కమీషనర్ హరితను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ రెడ్డి, జేఈవో సదా భార్గవి, సిఈ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ మోహన్, ఈఈ చంద్ర శేఖర్, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, ఆఫ్కాన్స్ ప్రతినిధి రంగ స్వామి తదితరులు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS