శ్రీనివాస సేతు పనులు సకాలంలో పూర్తి చేయండి.

Spread the love

శ్రీనివాస సేతు పనులు సకాలంలో పూర్తి చేయండి.

  • రోడ్లపైకి నీరు రాకుండా చర్యలు చేపట్టండి.
  • కమిషనర్ అనుపమ అంజలి.

సాక్షిత : బస్టాండ్ సమీపంలో జరుగుగుతున్న శ్రీనివాస సేతు పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్, రేణిగుంట రోడ్డు మార్గంలో జరుగుతున్న శ్రీనివాససేతు నిర్మాణ పనులను, తిరుమల బై పాస్ రోడ్డులోని సీపీఆర్ అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ కాలువను బుధవారం సాయంత్రం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
బస్టాండ్, రేణిగుంట రోడ్డు లో శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడ జరుగుతున్న పనుల వలన నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువకావడంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ఈ మాసాంతంలో వినాయక చవితి రానుండడంతో నిమజ్జన ఊరేగింపు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను, అప్కాన్స్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. బై పాస్ రోడ్డులోని సీపీఆర్ అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ కాలువలో నీరు రోడ్డుపైకి రాకుండా స్కిల్స్ తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పది రోజుల్లో.పనులు పూర్తి అయ్యే వరకు ఒక మోటార్ ఏర్పాటు చేసి మురుగు నీరు నిల్వకుండా చూడాలన్నారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, ఏఈకామ్ ప్రతినిధి బాలాజీ, అప్కాన్స్ ప్రతినిధి స్వామి, ఇంజినీర్లు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page