Sri Sri Sri Mallikarjuna Swamy Bhramarambika Kethamma 37 th Kalyanao
శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక కేతమ్మ 37 వ కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఈరోజు జగద్గిరిగుట్ట లోని శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక కేతమ్మ ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 18 న జరగనున్న స్వామి వారి 37 వ కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జేకె.శేఖర్ యాదవ్, నాయకులు మేకల సురేష్ రెడ్డి, గండి రాజు యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.