శ్రీ ఓంకారేశ్వర శివ వీరాంజనేయ స్వామి గణపతి సహిత నవగ్రహ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
సాక్షిత : 125-గాజులరామారం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ ఓంకారేశ్వర శివ వీరాంజనేయ స్వామి గణపతి సహిత నవగ్రహ దేవాలయాన్ని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సందర్శించి వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరాంజనేయ స్వామి దర్శనంతో కార్యసిద్ధి చేకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వేణు యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బెగ్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఆలయ కమిటీ సలహాదారులు అంజన్ గౌడ్, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుల్లారెడ్డి, శ్రీనివాస్ గుప్త, వైస్ ప్రెసిడెంట్ రాజలింగం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి వీరేష్, సాయి చరణ్, వీరన్న, మూసాఖాన్, నారాయణ, అరుణ్, నవీన్, జూనైద్ తదితరులు పాల్గొన్నారు.