SAKSHITHA NEWS

*తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం *


సాక్షితనెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

*మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.
కృష్ణ మందిరం నిర్మాణానికి తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చిన మహమ్మదాపురం యువతకు నా అభినందనలు.
సర్వేపల్లి నియోజకవర్గంలో 50 నూతన దేవాలయాలను నిర్మించడం నా లక్ష్యం.
భగవంతుని సేవ, దేవాలయాల నిర్మాణం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బి.సి. కాలనీలలో దేవాలయాల నిర్మాణాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేస్తుంది.
గతంలో కొన్ని దేవాలయాల నిర్మాణాలకు నియమ నిబంధనలు ఉండేవి.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రజల మనోభావాలను గౌరవించి, ప్రజలకు ఇష్టమైన భగవంతుని దేవాలయాల నిర్మాణాలు చేపట్టుకునేలా నిబంధనలను సడలించారు.


జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు అవసరమైన అన్ని చోట్ల నిధులు మంజూరు చేయించి, నిర్మించాం.
సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో మిగిలిపోయినవి ఏవైనా ఉంటే, అవి గుడులు, గోపురాల నిర్మాణాలే.
ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గానికి టీటీడీ ద్వారా 28 దేవాలయాల నిర్మాణం కోసం, 10 లక్షల చొప్పున, 2 కోట్ల 80 లక్షల రూపాయలు విడుదలయ్యాయి.


పొదలకూరు మండలంలో 9 దేవాలయాల నిర్మాణం కోసం 90 లక్షల రూపాయల నిధులు ఇచ్చిన టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కి, ఈ.ఓ.ధర్మారెడ్డి కి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు.
మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయాల నిర్మాణాలు జరగాలి.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.


SAKSHITHA NEWS