
అచ్చంపేట:-నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల కొండలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే రంగాపూర్ జాతర సందర్భంగా మైనార్టీ మహిళలు రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాలో పూజలు చేసి అనంతరం కొండపై వెలసిన శ్రీశైల ఉత్తర ద్వారముగా పిలవబడుతున్న ఉమామహేశ్వర క్షేత్రం వద్ద మైనార్టీ మహిళలు భక్తి పారవస్యంతో శివునికి పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా..మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచింది.
