SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 03 at 5.22.39 PM

నెంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్న 50 వాహనాలకు జరిమానా

నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

లైసెన్స్, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి తెలిపారు.
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే గుర్తించడం, లైసెన్సు లేకుండా వాహనాలను రోడ్లపై తిరగకుండా చేసేందుకు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

నుంచి ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.


నగర పరిధిలో లైసెన్సు, నంబర్‌ ప్లేట్‌, నంబర్‌ సక్రమంగా లేని, నంబర్‌ ట్యాంపర్డ్‌ కలిగిన, నంబర్‌ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్న 50 వాహనాల గుర్తించి సీజ్ చేసి, జరిమానా విధించారు. వాహన యజమానితోనే నంబర్‌ సరి చేయించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ …ఇకనుంచి నగర పరిధిలో ప్రధాన కూడళ్లతో పాటు ప్రధాన రహదారులపై నిరంతరం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండో ప్రాధాన్యత కింద నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.


అదేవిధంగా హెల్మెంట్‌ లేకుండా వాహనాలు నడపడం, పరిమితికి మించి వాహనంపై వెళ్లడంతో జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా వాహనదారులు జరిమానాల నుంచి తప్పించుకునేందుకు రిజిస్ట్రేషన్‌ అయి ఉన్పప్పటికీ కొంతమంది వాహనదారులు నంబర్‌ ప్లేట్‌ను తొలగించడం, ఉన్న నంబర్‌ ప్లేట్‌ను తిప్పివంచడం, నంబర్‌ తుడిపివేయడం చేస్తున్నారని, దీనిని అసరాగా తీసుకుని కొంత మంది దొంగతనాలకు పాల్పడినప్పుడు నంబర్‌ లేని వాహనాలను ఉపయోగిస్తున్నారని అన్నారు.

దీంతో చోరీలకు పాల్పడిన వారిని గుర్తించడం సవాల్‌గా మారుతోందన్నారు. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను గుర్తించడం కూడా కష్టంగా మారుతోందన్నారు. నేరాలను నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని గుర్తించేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మోటార్‌ వెహకిల్‌ నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు నంబర్‌ ప్లేట్‌ ఉండాలని, తనిఖీల సమయంలో వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్నప్పుడు పట్టుబడితే ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల సమయంలో వాహనాదారలు సహకరించాలని, ఇకనుంచి వాహనాల తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.


అదేవిధంగా వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలు వెంటనే వాటిని తొలగించాలని లేకుంటే చర్యలు వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐ ఆశోక్, ఎస్సై రవి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS