నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య, శివ ప్రసాద్ తదితరులు

Spread the love

మాజీ మంత్రి , అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట శేషయ్య..సోమిరెడ్డి అనుచరుడు బుజ్జి నాయుడే మట్టి అక్రమ తవ్వకాల సూత్రదారి అంటూ మీడియా ముందు ఆధారాలతో సహా ప్రదర్శించిన వెంకట శేషయ్య..సోమిరెడ్డి అతని దొంగ బ్యాచ్ చేతి వాటానికి, దన దాహానికి నిండు ప్రాణం బలైంది..

కనుపూరు చెరువును మట్టిని రైతు పేరుతో అక్రమంగా తరలిస్తున్న సూరాయ పాలెం బుజ్జి నాయుడు నీ అనుచరుడు కదా సోమిరెడ్డి..కక్కిన కూటికి కక్కుర్తి పడే సోమిరెడ్డి.. మా మంత్రి మీద అవినీతి ఆరోపణలు చేస్తాడా..?బుజ్జి నాయుడు టిప్పర్ ఢీ కొని బ్యాంక్ ఉద్యోగి మృతి చెందగా… ఏడుగురు గాయపడ్డారు.. ఆ పాపం సోమిరెడ్డి ది కాదా..?

ప్రమాదం జరిగిన రోజు దానికి కారణం కాకాణి బ్యాచ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన సోమిరెడ్డి.. తెల్లారే సరికి వాటిని ఎందుకు డిలీట్ చేశాడు..?ప్రమాదానికి కారణం టిడిపి నేత కాబట్టే.. సోమిరెడ్డి అన్ని మూసుకుని సైలెంట్ అయ్యాడు.. దీనికి సోమిరెడ్డి సమాధానం చెప్పాలి..సోమిరెడ్డి చెడిపోయిన బతుకు నియోజక వర్గంలో చెడ్డిలు వేసుకునే పిల్లాడికి కూడా తెలుసు..

సోమిరెడ్డి కుడి భుజంగా ఉండే బుజ్జి నాయుడురైతుల పేరుతో కనుపురు కాలువ నుంచి మట్టి తీసుకెళ్ళి.. ఎక్కడెక్కడ అమ్ముకున్నాడో నిన్న పోలీసుల విచారణలో వెల్లడైంది..టిప్పర్ ఓనర్ బుజ్జి నాయుడ్ని నీ పోలీసులు విచారిస్తుంటే.. సిఐకి ఫోన్ చేసి తిట్టడం నిజం కాదా..? సిఐ ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో పక్కా ప్లాన్ తో బుజ్జి నాయుడ్ని స్టేషన్ నుంచి తప్పించింది నువ్వు కాదా..?సోమిరెడ్డి దగ్గర ఉండే బ్యాచ్ అంతా రౌడీ షిటర్లు, హంతకులు, చీటర్లు.. ఈ దొంగల ముఠాకు సోమిరెడ్డి నాయకుడు..అవినీతి, అక్రమాలు, మోసాలు, చిలక్కొట్టుడు ఇవన్నీ సోమిరెడ్డికి చిన్నతనం నుంచే అలవాటు..

సోమిరెడ్డి ది బజారు బతుకు కావడం వల్లే.. నియోజక వర్గంలో అన్ని సార్లు ఓడిపోయాడు..సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియా పై విచారణ చెయ్యమని కలెక్టర్ ను కోరిన సోమిరెడ్డికి..టిప్పర్ ఢీ కొని బ్యాంక్ ఉద్యోగి చనిపోయిన ఘటన పై విచారణ కోరే దమ్ము ఉందా..?మట్టి దొంగలకు, దోపిడీ దారులకు సోమిరెడ్డి ఆశ్రయం కల్పిస్తున్నాడు…

Related Posts

You cannot copy content of this page