స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలి : ఎం.డి హరిత ఐఏఎస్
సాక్షిత : తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం జరిగింది. స్మార్ట్ సిటీ ఎం.డి హరితా అధికారులతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో అండర్ కేబుల్ విధ్యుత్ లైన్ల కోసం త్రవ్వేసిన గుంతలను సరిగా పూడ్చడం లేదని, కొన్ని చోట్ల పూడ్చినా కవరింగ్ సరిగా లేదన్నారు. వీలైనంత త్వరగా అండర్ కేబుల్ విధ్యుత్ లైన్ పనులను పూర్తి చేయాలని విధ్యుత్ అధికారులకు, పనులు చేపట్టిన అమరాజా, జాక్సన్ సంస్థల ప్రతినిధులకు సూచించారు.
వినాయకసాగర్ వద్ద నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను పూర్తి చేసి అద్దెకు ఇవ్వడం వలన కార్పొరేషన్ కి ఆదాయం చేకూరుతుందన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కోసం నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను వేగవంతం చేసి వచ్చే సంవత్సరం మొదటి నెలల్లోనే ప్రారంబించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మల్టి లెవల్ కార్ పార్కింగ్, ఆర్ట్ థీయేటర్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియంలపై సమీక్ష నిర్వహించిన తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అధికారులకు తగు సూచనలు చేసి పనుల వేగవంతానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంధ్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు దేవిక, గోమతి, సంజీవ్ కుమార్, మహేష్, మోహన్, ఏఓ రాజశేఖర్ తదితర్లు పాల్గొన్నారు.