సాక్షిత : తిరుపతి అభివృద్దికై చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనుల వివరాలను తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై డైరెక్టర్లతో ప్రత్యక్షంగాను, జూమ్ మీటింగు ద్వారా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను అనుపమ వివరించారు. ముఖ్యంగా శ్రీనివాససేతు మూడవ దశ పనుల గురించి వివరిస్తూ జూన్ కంతా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. తిరుపతి నగరం విస్తరిస్తూ జనభా పెరగడంతో వాహనదారులకు అవసరమైన చోట్ల ఫ్రి లెప్ట్ లు నిర్మించేందుకు కృషి చేయాల్సిన అవసరముందని తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కాలపరిమితి పూర్తి అవుతున్నందున, స్మార్ట్ సిటీ పూర్తి చేసిన ఆస్తులన్నింటిని నిర్వహణ కోసం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కు అప్పగిస్తూ బోర్డ్ తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో జూమ్ ద్వారా స్మార్ట్ సిటీ డైరెక్టర్స్ తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టిటిడి జెఈఓ సదాభార్గవి, డిల్లీ నుండి అండర్ సెక్రటరీ విజయకుమార్, తుడా వీసి హరికృష్ణ, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రామచంధ్రా రెడ్డి, డాక్టర్ రమాశ్రీ, జి.ఎం చంధ్రమౌళీ, ఎస్.ఈ తిరుమాలిక మోహన్, ఎంఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
తిరుపతి అభివృద్ధిపై స్మార్ట్ సిటీ బోర్డ్ సమావేశం
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…