Small traders who met the MLA to work to provide vendors certificates.
వెండర్స్ సర్టిఫికెట్లు అందజేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన చిరువ్యాపారులు…
చిరువ్యాపారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరువ్యాపారుల జీవనోపాధి మరియు క్రమబద్ధీకరణ చట్టం 2014 ప్రకారం వెండింగ్ జోన్ మరియు వెండింగ్ సర్టిఫికెట్లు వెండర్స్ కు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు.
ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధిలో భాగంగా 90 నుంచి 100 మంది వెండర్స్ ని తొలగించడంతో జీవనోపాధి కోల్పోయామని, జంక్షన్ లో బస్టాప్ వెనుక మార్కింగ్ చేసి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మరియు స్ట్రీట్ వెండర్స్ ను వెండింగ్ జోన్ చేసి జీహెచ్ఎంసీ ద్వారా వెండర్స్ కి సర్టిఫికెట్లు అందజేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
స్ట్రీట్ వెండర్స్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రంగ శాలివన్, జనరల్ సెక్రెటరీ అలివేలు మంగ, ఈసీ మెంబర్ పోచమ్మ తదితరులు పాల్గొన్నారు