సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం

Spread the love

సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించిన పోలీస్ కమీషనర్ దంపతులు


సాక్షిత : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయము, విజయవాడ.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ బందర్ రోడ్ నందు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో ది.30.03.2023వ తేదీన యన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలకగా, పోలీస్ కమీషనర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో స్వామి వార్లకు పట్టువస్త్రాలను సమర్పించి, అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులకు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ దంపతులు అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్., ట్రాఫిక్ డి.సి.పి. కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., డి. సి.పి. ఎ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్., అడ్మిన్ డి.సి. పి. శ్రీ మోకా సత్తిబాబు , సి.ఎస్.డబ్ల్వు డి.సి.పి. . బి.రామ కృష్ణ , సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏ.డి.సి.పి. సి. హెచ్. లక్ష్మీపతి , క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీమతి పి. వెంకటరత్నం గాటు, ఏ.ఆర్.ఏ.డి.సి.పి..కె. శ్రీనివాసరావు , ఎ.పి.సి.పి.లు జి. వి. రమణమూర్తి , వి.ఎస్.వాసన్ , చెంచి రెడ్డి , పోలీస్ కమీషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోషియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page