జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినశ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపిఎస్.,

Spread the love

స్వేచ్చగా, న్యాయబద్ధంగా సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహించడమే మొదటి ప్రాధాన్యత.

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను.

తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా పుణ్యక్షేత్రం భక్తులకు భద్రతే ప్రధాన లక్ష్యం

శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తా.. పరిరక్షించడాన్ని అత్యంత కీలకంగా తీసుకుంటా.

పోలీసులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ చట్ట ప్రకారం విధులు నిర్వహించాలి.

జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపిఎస్.,

  ఉదయం 11:00 గంటలకు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా నూతన ఎస్పీగా శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్., బాధ్యతలు స్వీకరించారు. ఈయన RR:2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో రంపచోడవరం ASPగా, కర్నూలు జిల్లా SEB అదనపు ఎస్పీగా, విజయవాడ కమిషనరేట్ లో శాంతి భద్రతల డిసిపి గా విధులు నిర్వర్తించారు. సాధారణ బదిలీలలో భాగంగా తిరుపతి జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు.

 ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్., మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా రానున్న సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అత్యంత ఖచ్చితత్వంతో సమగ్రంగా ప్రణాళికలను రూపొందించి ముందుకు తీసుకువెళ్తామన్నారు. అలాగే తాను, తన టీం అయిన జిల్లా పోలీసులు అందరం కలసి మొదటి ప్రాముఖ్యత గా తీసుకొని అమలు పరుస్తామన్నారు. త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలకు సన్నాహక చర్యలలో భాగంగా అంతర్ రాష్ట్ర, జిల్లా చెక్పోస్టుల వద్ద తగిన పోలీసు సిబ్బందిని, కేంద్ర సాయుధ బలగాలను నియమించి సమర్థవంతంగా తనిఖీలు చేపట్టి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉక్కు పాదం మోపుతామన్నారు. అదే సమయంలో ఏలాంటి ఆక్రమణ రవాణా జరగకుండా అడ్డుకట్ట వేస్తామని ఈ సందర్భంగా అన్నారు.

 తిరుపతి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులు తాకిడి ఉంటుంది. భక్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మానవసేవయే మాధవ సేవగా భావించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలను కాపాడుకుంటూ, అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. 

 ముఖ్యంగా జిల్లాలో  శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం, శ్రీ సిటీ పారిశ్రామిక వాడ, వంటి సంక్లిష్టమైన మౌలిక సదుపాయాలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ కూడా తగిన గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు.

 అదేవిధంగా తిరుపతి జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా సరిహద్దును కలిగి ఉంది, కర్ణాటకకు దగ్గరగా ఉంది. కావున ఇరుగుపొరుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సరిహద్దుల ద్వారా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు.

 పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే మనకు ఎన్నో కేసుల బాధ్యతలు ఉంటాయి. అయితే బాధితులు వారికున్న ఒకే సమస్య గురించి స్టేషన్కు వస్తారు. వారితో మర్యాదగా మాట్లాడి వారిపట్ల సానుభూతిపరుడై, చాలా సహనంగా వారి సమస్యను తెలుసుకొని పరిష్కార మార్గం చూపాలి. పోలీసులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ చట్ట ప్రకారం నిర్దేశించిన విధులను నిర్వహించాలని, తన టీం అయిన జిల్లా పోలీసులకు పిలుపునిచ్చారు.

  రానున్న ఎన్నికల సమయంలో మీడియా వారి సహాయ సహకారం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన మూల స్తంభమైన మీడియా వారు నిత్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్., గారు విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ దేవరాజ్ మనీష్ పాటిల్, అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, కులశేఖర్ శాంతి భద్రత, శ్రీమతి విమల కుమారి నేర విభాగం, సెబ్ రాజేంద్ర, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి జిల్లా ఎస్పీ గారికి ఘనంగా స్వాగతం పలికారు.

Related Posts

You cannot copy content of this page