ఆదివారం రామచంద్రపురం గ్రామంలో జరగనున్న శ్రావణమాస బోనాల పండుగ సందర్బంగా రామచంద్రపురం ఐదుగుళ్ల పోచమ్మ దేవాలయం,ఎస్సి బస్తీలో సంగీత థియేటర్ పక్కన ఉన్న పోచమ్మ దేవాలయం,బస్తి దవాఖాన పక్కన ఉన్న పోచమ్మ దేవాలయంలో జిహెచ్ఎంసి శానిటేషన్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రిసిటీ,ఎంతమాలజి,ఇంజినీరింగ్ విభాగ అధికారులతో మరియు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి బోనాల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .
మునుపటి ఏడాది కంటే బిన్నంగా లైటింగ్,శానిటేషన్,కరెంటు పోకుండా,దోమల బెడద లేకుండా చూసుకోవాలి అని అధికారులకు ఆదేశించిన కార్పొరేటర్.వారితో బేకు యాదయ్య,బుల్లా అశోక్,సజ్జ యాదయ్య,బల్ల నర్సింగ్,గడ్డం కుమార్,ముత్తన్న వీరయ్య,బంటు నర్సింహా,బేగరి బాలరాజు,బేగరి నర్సింహా,గడ్డం మల్లేష్,గడ్డం నరేష్,గంగు నాగరాజు,ఎర్ర దశరథ్,గడ్డం కుమార్ తదితరులు.