శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల నైట్ షెల్టర్ హోమ్ నిరాశ్యులందరికీ పండ్లు, స్వీట్స్

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల నైట్ షెల్టర్ హోమ్ నిరాశ్యులందరికీ పండ్లు, స్వీట్స్, బ్లాంకెట్స్, నిత్యవసర వస్తువుల పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల నైట్ షెల్టర్ లో జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి నైట్ షెల్టర్ హోమ్ లో నిరాహాశయులుగా ఉంటున్న వారికి దాతల సహాయంతో ఫ్రూట్స్, స్వీట్లు, బ్లాంకెట్స్ మరియు బియ్యం, పప్పు, నూనె, ఉప్పు, కారం తదితర నిత్యవసర వస్తువులను, మరో దాత విశాల్ అనే దాత సహాయంతో స్టవ్వు అందజేయడం జరిగినది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయించి అర్హులైన వారు వ్యాక్సిన్ వేసుకునేలా, వ్యాక్సిన్ వేసుకొని పీరియడ్ కంప్లీట్ అయిన వారికి బూస్టర్ దోస్ వేసుకునేలా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరిగినది. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ నైట్ షెల్టర్ హోమ్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మీరు పరిశుభ్రంగా ఉండాలని, మీరు పరిశుభ్రంగా ఉంటూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నచో ఎలాంటి అనారోగ్యాలకు లోనవ్వరని, మీరు పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నచో ఆరోగ్యంగా ఉంటారని నైట్ షెల్టర్ హోమ్ నిరాశయులకు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వెంకన్న , డాక్టర్. ఏ.ఎం.ఓ నాగేష్ , అర్బన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ ఆఫీసర్ మన్వి , శాంటేషన్ సూపర్వైజర్ జలంధర్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్ , గోపాల్ యాదవ్, ఎస్ఆర్పి బాలరాజ్, ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఎస్ఎఫ్ఏ లు, అర్బన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page