శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3,00,000/- రూపాయలు మంజూరి అయినవి అని,

CMRF- LOC వివరాలు

  1. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ కి చెందిన అమూల్య కి 2,00,000/- రెండు లక్షల రూపాయలు

2.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కి చెందిన సంధ్యారాణి కి 1,00,000/- ఒక లక్ష రూపాయలు

మంజూరి అయినవి అని అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గుమ్మడి శ్రీనివాస్ ,రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page