సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

Spread the love

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు సంబంధించి సన్నాహక సమావేశంనిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ ..పాల్గొన్న మాజీ మంత్రి మహమ్మద్ అలీ , ఎం.ఎల్.సి ఎం.ఎన్ శ్రీనివాస్ , సికింద్రాబాద్ అసెంబ్లీ పార్లమెంటరి ఇంచార్జ్ మేడే రాజీవ్ సాగర్ , స్థానిక కార్పొరేటర్లు , బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు….

బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించిన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్…

బి.ఆర్.ఎస్ పార్ట్ కి ఓటు వేసి పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో మనమంతా గెలిపించుకుందాం…
ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..సామాన్య కార్యకర్త నుండీ నేను ఈ స్థాయి వచ్చిన.తలసాని శ్రీనివాస్ యాదవ్, నేను మంచి మిత్రులం.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం గెలిచాం.
అందరం మంచి మెజార్టీతో గెలిచాం.పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మనం గెలవాలి.గతంలో సికింద్రాబాద్ నుండీ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రం నుండీ ఒక్క రూపాయి ఖర్చు తేలేదు, ఖర్చు చెయ్యలేదు.
కిషన్ రెడ్డి జై శ్రీరాం, మోడీ అని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నాడు.ఇక దానం నాగేందర్ పేరు ఎత్తాలంటేనే సిగ్గు అనిపిస్తుంది.దానం నాగేందర్ మా పార్టీ నుండి గెలిచి, వేరే పార్టీలోకి వెళ్ళాడు.దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజినామా చెయ్యకుండా ఎంపిగా పోటీ చేస్తున్నాడు.రాబోయే రోజుల్లో ఉన్న పదవి పోతుంది.మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో 39 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలం గెలిచాం.
దానం నాగేందర్ లాంటోల్లు ముగ్గురు పార్టీ మారారు.
ఎంత మంది పార్టి మారిన ఏం కాదు, నాయకులను తయారు చేసుకుంటాం.
రాబోయే రోజులు బిఆర్ఎస్ పార్టీదే, మళ్లీ కెసిఅర్ గారే ముఖ్యమంత్రి .కచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.
దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటడో తెలియదని దానం నాగేందర్ కు ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు.
బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి బిజెపి కార్యకర్తలే ఓట్లు వెయ్యం అంటున్నారు.
పార్లమెంట్ లో సికింద్రాబాద్ నుండీ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అడుగు పెడుతున్నాడు.ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు వారాలు కష్టపడి గెలిచి తీరుదాం…

మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ డ్రామాలు అన్ని చూస్తున్నాం.ప్రజలకు కావల్సింది డ్రామాలు కాదు.
ప్రజలకు కావల్సింది అభివృద్ది.శాసన సభ ఎన్నికలు ముగియగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి .6 నెలలు లేటుగా ఎన్నికలు వచ్చింటే పుడ్ బాల్ ఆడే వాళ్ళం.
నాలుగు నెలలు ఓపిక పడుదామని, మా నాయకులకు నేను చెప్పిన.
బిఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధి అక్కడ అక్కడ కొన్ని పనులు ఆగిపోయాయి.పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి పనులు చేపిద్దాం.
పెద కుటుంభం నుండీ వచ్చిన వాళ్ళం నేను, పద్మారావు గౌడ్ గారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి ఆర్ ఎస్ అభ్యర్ధిగా పద్మారావు గౌడ్ పేరు కేసీఆర్ గారు అనౌన్స్ చెయ్యగానే లష్కర్ ప్రజలు ఆనందం వ్యక్త పరిచారు.
అసెంబ్లీ ఎన్నికల లాగానే, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలి .
ఈరోజు కేసీఆర్ గారు బస్సు యాత్రకు బయలుదేరి వెళ్లారు.పల్లేల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది, సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లు అమలు కావడం లేదని ప్రజలే చెప్తున్నారు.
6 గ్యారెంటీ లు అమలు అవుతున్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం అబద్ధాలు చెప్తున్నారు.
బిఆర్ఎస్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కార్యక్రమానికి ఒక్కరు రాలేదు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పద్మారావు గౌడ్ పాదయాత్ర చేయబోతున్నారు.అందరి సహకారంతో పద్మారావు గౌడ్ పాదయాత్ర విజయవంతం చేద్దాం.
బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కళ్లముందు కనపడుతుంది, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఒక్క రూపాయి తేలే.ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.నాయకులు , కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు.
డబుల్ బెడ్ రూం ఇల్లులు పుట్టిందే IDS కాలనిలో
డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదని ప్రజలకు అబద్ధాల చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చేద్దాం.

Related Posts

You cannot copy content of this page