SAKSHITHA NEWS

సాక్షిత : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తార్నాక డివిజన్ లో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో కిలిసి ఇంటింటికి తిరుగుతూ ఉప సభాపతి పద్మారావు గౌడ్ పింఛన్ల గుర్తుపు కార్డులు పంపిణి చేశారు. అనంతరం సీతాఫలమండీ కర్పోరేటర్ కుమారీ సామల హేమతో కలిసి కార్పొరేటర్ తో కలిసి సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో సితాఫలమండీ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు ఆసరా పించన్ల గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అర్హులకు పించన్లు అందించందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. ఎక్కువ మంది లబ్దిదారులకు వివిధ సదుపాయాలను అందించాలనే లక్షంతో పని చేస్తున్నామని, అధికార యంత్రాంగం కూడా పేదల పట్ల సానుభూతితో వ్యవహరించాలని పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. అడ్డగుట్ట, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ తార్నాక దివిజనలలో ఇంటికే తిరిగామని, అన్నీ ఇళ్లకు నిర్ధారిత వ్యవస్థలోగా చేరుకొనే పరిస్థితి లేనందున ప్రతి దివిజన పరిధిలో సమావేశాలు ఏర్పటు చేస్తున్నామని పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో ఆరు వేల మందికి కొత్తగా పింఛన్లు మంజురయ్యాయని, అర్హులకు పింఛన్లు అందాయని ఆయన చెప్పారు. అధికారులు, కార్పొరేటర్లు, నేతలు, స్థానిక ప్రముఖులతో పాటు కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి. సీనియర్ నేత కరాటే రాజు, BRS
నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS