ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి
గుంటూరు: గ్రామ సచివాలయాలు ఏర్పడిన తరువాత సచివాలయంలో జిల్లాలో తొలిగా ఎసిబి అధికారులు దాడులు జరిగాయి.
గుంటూరు ఏటి అగ్రహారంలో 89వ వార్డు సచివాలయంలో నాగభూషణం ఒక వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా అడ్మిన్ సెక్రటరీ ఆరీఫ్‌ను ఎసిబి అదుపులోకి తీసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు నాగభూషణం ఇటీవల అపార్టుమెంట్ కొనుగోలు చేయగా పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇందుకుగాను ఆరీఫ్ లంచంగా కనీసం రూ.5 వేలు ఇవ్వాలని, ఇది తన ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని డిమాండ్ చేశాడు. అంతేగాక ఆరీఫ్ తనను అనుచితంగానూ మాట్లాడినట్లు బాధితుడు నాగభూషణం ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు.దీంతో ఎసిబి అధికారుల సూచనల మేరకు రూ.4 వేలనునారిఫ్‌కు నాగభూషనం ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు.
పనితీరు సరిగా లేకపోవడంతో రెండురోజుల క్రితం ఆరీఫ్‌కు నగర పాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి షోకాజ్ నోటీసు జారీ చేశారు.తమ పేర్లు చెప్పి ఆరీఫ్ సొమ్ము వసూలు చేశారని ఎసిబికి ఫిర్యాదు వెళ్లిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన మున్సిపల్ ఆర్‌ఐ, ఆర్‌ఒలు ఖంగుతిన్నారు.వీరిపైనా విచారణకు అవకాశం ఉన్నట్లు తెలిసింది.