SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా (చీరాల నియోజకవర్గం)

భవిష్యత్తుకు గ్యారెంటీ పై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటు పరిధిలో రెండవ రోజు ది:21-06-2023 న చీరాల నియోజకవర్గంలోచైతన్య రథయాత్ర లో పాల్గొని మరియు వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామం నందు కొనిజేటి చేనేతపురి కాలనీ నందు రచ్చబండ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు గారు.ఇంకా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు,సీనియర్ నేతలతో 45 మంది సభ్యులతో నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు.

భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో పై వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామం నందు కొనిజేటి చేనేతపురి కాలనీ నందు రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మాట్లాడుతూ

వైసీపీ పాలనలో చేనేత కార్మికుల ఆకలి చావులు పెరిగిపోయాయి – నేతన్నలను వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తోంది – చేనేత ముడిసరుకులకు ప్రభుత్వం తక్షణమే రాయితీ పెంచాలి – చేనేతలను గౌరవించే పార్టీ టీడీపీ –

జగన్ పాలనలో చేనేత వర్గం నిర్లక్ష్యానికి గురైంది – 2019 నుంచి ఏపీలో పన్నుల మోత.. రాయితీల కోత నడుస్తా ఉంది – నేతన్నల ముడి సరుకులపై రాయితీలు ఎత్తివేయడంతో చేనేతల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీ ప్రజల విముక్తి కోసం చైతన్య రథయాత్ర

సకల వర్గాల శ్రేయస్సు కోసమే మినీ మేనిఫెస్టో

ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం , రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, అరాచక పాలనను అంత మెందించేందుకు , తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని కాపాడేందుకు తారక రాముడు స్ఫూర్తితో బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం జరుగుతుందన్నారు.

అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం చంద్రన్న మినీ మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
నరకాసుర పాలన విముక్తి కోసం జరిగే ఈ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇంటికొకరు చొప్పున పాల్గొనాలని పిలుపునిచ్చారు

భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో పై మాట్లాడుతూ

మహాశక్తి పధకం లో భాగంగా

i) తల్లికి వందనం’ పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి రూ.15,000.

II)ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ. 1,500.

III)దీపం’ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

IV) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

యువగళం పధకం లో భాగంగా

I) 20 లక్షల మంది యువతకు ఉపాధి.

II) నిరుద్యోగులకు ‘యువగళం నిధి’ నుంచి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి

అన్నదాత పధకం లో భాగంగా

I) ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం

ఇంటింటికీ నీరు పధకం లో భాగంగా

“ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ రక్షిత త్రాగు నీటి కుళాయి కనెక్షన్

బీసీలకు రక్షణ చట్టం లో భాగంగా

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి… వారికి అన్ని విధాలా అండ

పూర్ టు రిచ్ లో భాగం గా

I) పేదలను సంపన్నులను చేసే ప్రణాళిక

II) ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం

రాబోయే రోజుల్లో YCP ప్రభుత్వం ను గద్దె దింపే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు కలిసి చేయాలని అందుకు భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమం ను విజయవంతం చేయాలని కోరారు

రాబోయే ఏడు నెలలు చాలా కీలమైనవి. నేతలందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి. 175 కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలి. రాష్ట్రం కోసం, రాబోయే తరాల మహత్తర భవిష్యత్తు కోసం మనమందరం పనిచేయాలి.


SAKSHITHA NEWS