SAKSHITHA NEWS

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.


సాక్షిత : గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని పారిశ్రామిక కార్యాలయం పక్కన గల వాటర్ ట్యాంక్,పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మేనేజర్ సుధాకర్ ని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,మాజీ కౌన్సిలర్ నర్సయ్య లు మాట్లాడుతూ గాంధీ నగర్ పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం కార్మికుల,యాజమాన్యాల సౌకర్యార్థం కోసం పార్క్,వాటర్ ట్యాంక్,పోస్ట్ ఆపీస్,బ్యాంక్ లకొరకు స్థలం కేటాయించి వాటిని నిర్వహించడం జరిగిందన్నారు.కానీ అధికారుల అలసత్వం, ముందు చూపులేక పోవడం వల్ల నేడు ఆ స్థలాలు ఇతరుల పాలయిందని కావున అధికారులు ఇప్పటికైనా ఉన్న స్థలాలను ఇతరులకు అమ్మకుండా కార్మికుల సౌకర్యార్థం ఉంచాలని కోరారు.

అలాగే పరిశ్రమల కోసం నాడు ప్రభుత్వాలు రాయితితో స్థలాలను ఇస్తే నేడు ఆ భూములను కమర్షియల్ కోసం వాడుకోవడం,అక్కడ పనిచేసిన కార్మికులను రోడ్డు పై వెయ్యడం అన్యాయమని కావున అందులో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఐవై ఎఫ్ అధ్యక్షుడు సంతోష్,సీపీఐ శాఖ కార్యదర్శి యాకుబ్,స్థానిక సీపీఐ నాయకులు చందు, ఇమామ్, బాల్ రెడ్డి,తిరుపతి, అంజి రెడ్డి,వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 01 03 at 3.15.47 PM

SAKSHITHA NEWS