పేదల ఆకలి తీర్చడం గొప్ప వరం.రమేష్ బాబు

Spread the love

సాక్షిత కల్వకుర్తి ప్రతినిధి :సమాజంలోని పేదల ఆకలి తీర్చడం గొప్ప వరం అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జులూరి రమేష్ బాబు అన్నారు.మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

ఈకార్యమానికి ముఖ్యఅతిథిగా రమేష్ బాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కల్వకుర్తి క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలు తిరుగులేనివి అని రమేష్ బాబు అన్నారు. ఈకార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి లయన్ దుగ్గివెంకటేష్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బకిషన్, పిఆర్వో అప్పాయిపల్లి శ్రీనివాస్, సభ్యులు కంది ప్రవీణ్, పొలారాజేందర్, గోవింద్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page