Distribution of Kalyana Lakmi, Shadi Mubarak Checks in Sarur Nagar Tehsildar Office Premises
సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్మి,షాది ముబారాక్ చెక్కులను పంపిణీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
సాక్షిత : ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం ,దయనంద్ ,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెల్పి నూతన వదువులకు చీరలు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు గుదిబండ అనుకునే దిశ నుండి లక్ష్మిదేవిగా భావిస్తున్నారన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు చేయడం లేదన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఇచ్చి అడబిడ్డల నీటి కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
కేసీఆర్ కిట్లతో అమ్మాయి పుడితే 13,అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తున్న ప్రభుత్వం.
పండుగలు వస్తే గిఫ్టులు ఇస్తూ,దసరా కు బతుకమ్మ చీరలు,రంజాన్ తోఫా,క్రిస్మస్ కానుకలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.
రాష్ట్రంలో 10 లక్షల నూతన పెన్షన్లు, రంగారెడ్డి జిల్లాలో 54 వేలు,సరూర్ నగర్ మండలం లో 5 వేలకు పైగా నూతనంగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.57 ఏళ్లకు పెన్షన్ వాగ్దానం నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి లబ్ధిదారుల తరుపున,ప్రజల తరుపున ధన్యవాదాలు.