SAKSHITHA NEWS

  • ఆయన దేశానికి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి
  • 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతాన్ని నిర్మించిన ఘనత వారికే దక్కుతుంది
  • ఈ తరాల యువతి యువకులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిదాయకం
  • సర్దార్ వల్లభాయ్ పటేల్ ఔనత్యాన్ని రాబోయే తరాలకు తెలిసే విధంగా విగ్రహ ఏర్పాటు చేసిన గామిడి మధుసూధన్ రెడ్డి
  • సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన
  • ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కిష్టాపూర్ లో మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభ బాయ్ పటేల్ భారత దేశానికి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగానిలిచి పోతాయని భారత దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కృషిని శ్లాఘించారు.562 సంస్థానాలను విలీనం చేసి ఐక్యభారతాన్ని నిర్మించిన ఘనత పటేల్ కే దక్కుతుందన్నారు.ఈ తరాలకు యువతీ, యువకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు.మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఔనత్యాన్ని రాబోయే తరాలకు తెలిసే విధంగా ఏర్పాటు చేసిన విగ్రహ దాత గామిడి మధుసూధన్ రెడ్డి ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి జకట ప్రేమ్ దాస్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,నాయకులు బస్వ రాజు గౌడ్,సుధాకర్ రెడ్డి,రామచంద్రా రెడ్డి,దగ్గు రాజు,జనార్ధన్ రెడ్డి,సత్యనారాయణ రెడ్డి,యువ నాయకులు రాఘవ రెడ్డి,రాగం అర్జున్,వంశీ విజయ్,అర్జున్,కేశవ్ రెడ్డి,భరత్,వంశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 12 15 at 2.30.02 PM

SAKSHITHA NEWS