SAKSHITHA NEWS

Sant Sewalal Maharaj, Guide to Banjaras : MLA KP Vivekanand

బంజారాలకు మార్గదర్శి సంత్ సేవాలాల్ మహారాజ్ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట, సూరారం శివాలయ నగర్, తెలుగుతల్లి నగర్ లలో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారాలకు మార్గదర్శి సంత్ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. బంజారాలను మంచిమార్గంలో నడిపించడానికి సేవాలాల్‌ అవతరించారని, ఆయన బోధనల ద్వారా బంజారా జాతి నడచుకుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బంజారా సమాజ్ వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS