SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మౌలిక వసతులపై వినతి పత్రం అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ప్రజలంతా ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ తో అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

Whatsapp Image 2024 01 18 At 12.48.16 Pm

SAKSHITHA NEWS