త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది

Spread the love

త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది
సాక్షిత : హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలలో మాందారిపేట, శాయంపేట మీదుగా పత్తిపాక వరకు సాగిన పాదయాత్ర..

  • ముఖ్య అతిథిగా పాల్గొని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గండ్ర సత్యనారాయణ రావు..

శాయంపేట మండలం
కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపడమే తమ లక్ష్యమని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు. అన్నారు. శనివారం మండలంలోని మాందారిపేట స్టేజీ నుండి శాయంపేట మండల కేంద్రం నుండి పత్తిపాక వరకు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి. ఆధ్వర్యంలో ఆజాదికా గౌరవ్ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర కు ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
యువత స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి, త్యాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రేపు అనగా ఆదివారం రోజున గాంధీనగర్ క్రాస్ నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ముగింపు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్ హాజరవుతున్నారని, కావున ఇట్టి భారీ ముగింపు పాదయాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు తరలి రావాలని గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.

ఈ పాదయాత్రలో పత్తిపాక ఎంపిటిసి సభ్యులు గజ్జి ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి, వైనాల కుమారస్వామి, మారపెల్లి బుజ్జన్న, హైదర్, నిమ్మల రమేష్, కుక్కల భిక్షపతి, మారపెల్లి కట్టయ్య, తడక కుమారస్వామి, కృష్ణమూర్తి, నాగేశ్వర్ రావు, రఫీ, సతీష్, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు…..

Related Posts

You cannot copy content of this page