Rural progress is the main goal: Vikarabad MLA Dr. Metuku Anand *
పల్లెల ప్రగతియే ప్రధాన లక్ష్యం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని గుట్టమీది తండా, ఎల్లమ్మ గడ్డ తండా మరియు రాళ్ల గుడుపల్లి గ్రామాల్లో ఉదయం 07:00 AM నుండి 12:30 PM వరకు పర్యటించారు.
గుట్టమీది తండా మరియు ఎల్లమ్మ గడ్డ తండాలలో పాడబడ్డ ఇళ్ళు మరియు పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో… పల్లె ప్రగతిలో ఏం చేశారని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ… పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
గ్రామంలో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
గ్రామాల్లో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, పాత విద్యుత్ స్థంబాలను తొలగించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ… విద్యుత్ సేవలు అందించాలన్నారు.
మిషన్ భగీరథ మంచినీటి పైపు లైన్లు ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, మిషన్ భగీరథ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ… ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ మంచి నీటిని ప్రజలందరూ.. త్రాగాలని అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.