మహిళలకు వైఎస్సార్ ఆసరా కింద రూ.49.88కోట్లు విడుదల
నియోజకవర్గ వ్యాప్తంగా 5,816 సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు లబ్ది.
మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడి.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి, 29.3.2023.
వైయస్సార్ ఆసరా పథకం కింద మైలవరం నియోజకవర్గంలోని 5,816 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.49,88,10,321ల నిధులు విడుదల చేసినట్లు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో సచివాలయం ఆవరణలో వైయస్సార్ ఆసరా ఉత్సవాల కార్యక్రమానికి శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మంచి చేస్తున్న జగనన్నకు అండగా ఉండండి.
ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల్లోని అక్కా చెల్లెమ్మలకు ఆసరాగా నిలిచేందుకు పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 2019 మార్చి 31 నాటికి డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి రూ.25,500 కోట్లకు ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని మహిళలకు పిలుపునిచ్చారు.
698 సంఘాలకు రూ.6.20 కోట్లు.
విజయవాడ రూరల్ మండలంలోని 698 స్వయ సహాయక సంఘాలకు రూ.6,20,52,650ల వైఎస్సార్ ఆసరా నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. కుటుంబ వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించే మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం మహిళల పేరుతోనే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసరా నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, వైసీపీ కుటుంబ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు