రూ. 10 వేల కోట్ల విలువైన ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ హెచ్ పీసీతో ఒప్పందం
మెగావాట్ కు లక్ష చొప్పుల ప్రభుత్వానికి వందేళ్ల పాటు రాయల్టీ ఆదాయం
3 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా ఏపీ…. సీఎం జగన్
నంద్యాల జిల్లాలోని అవుకు, పాణ్యం, బేతంచెర్ల, డోన్ మండలాల్లో ఈ సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. అవుకు మండలంలో జూనూతల, ఉప్పలపాడు, కొండమనాయునిపల్లి గ్రామాల్లో గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 2,300 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎంగ్రీన్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 700 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 300 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు, బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్ మండల కేంద్రంలో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 1000 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 1000 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయిని, మరో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కోసం ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సీఎం జగన్ వివరించారు.
8 వేల ఎకరాల్లో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్లాంట్
తాజా పెట్టుబడులతో రాష్ట్రంలో 8 వేల ఎకరాల్లో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులే ఆధారం
పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్ ఎనర్జీ అందుతుందని సీఎం పేర్కొన్నారు.
రూ. 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం.
వందేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం
ప్రతి మెగావాట్ ఉత్పత్తికి ఈ ప్రాజెక్టుల నుంచి వందేళ్ల పాటు రాయల్టీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ. లక్ష చొప్పున ఆదాయంతో పాటు జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ప్రాజెక్టులకు సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు పేరున ఆదాయం వస్తుందన్నారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము పెరుగుతుందని, ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుడంతో పాటు యువతకు స్థానికంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
యువతకి ఉద్యోగ అవకాశాల కల్పన మన జగనన్న ప్రభుత్వ లక్ష్యమని చల్లా శ్రీ లక్ష్మీ భగీరథ రెడ్డి గారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో చల్లా ప్రభాకర్ రెడ్డి గారు,చల్లా రామేశ్వర్ రెడ్డి గారు, చల్లా విక్రాంత్ రెడ్డి,చల్లా చైతన్య రెడ్డి, చల్లా చరణ్ రెడ్డి పాల్గొన్నారు.
వైయస్సార్సీపి పార్టీ తరఫునుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.