SAKSHITHA NEWS

గత ఎన్నో రోజుల నుంచి మయూరి నగర్ వాసులు,స్థానిక అన్ని కాలనీ ల వినత మేరకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తన సొంత నిధులతో జెసిబి తెప్పించి మయూరి నగర్ కరెంటు ఆఫీస్ నుంచి ఏషియన్ హాస్పిటల్ వరకు చుట్టుప్రక్కల ఉన్న చెత్తను,పిచ్చి మొక్కలను తొలగించి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రోడ్ విస్తరణకు కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.కార్పొరేటర్ మాట్లాడుతూ బీరంగూడ కమాన్,కరెంటు ఆఫీస్ రోడ్డులో రోడ్డుకు ఇరు వైపులా బైక్ లు పార్కింగ్ చెయ్యడం వలన చాల ఇబ్బంది అవుతుంది అని,ఇలాగే రోజు పార్కింగ్ చేస్తే వెంటనే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా చలాన్ మరియు బైక్ లు సిజ్ చేస్తారు కావున అందరు దయచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేసుకోవాలి అని మనవి.వారితో కాలనీ అధ్యక్షులు రాజు గౌడ్,మహిపాల్ రెడ్డి,వెంకట్ రామ్ రెడ్డి,దేవేందర్ యాదవ్,రమేష్,సీఎం మల్లేష్,లింగం,వెంకటేష్,వాసుదేవ్,శ్రీనివాస్ రెడ్డి తదితరులు.


SAKSHITHA NEWS