SAKSHITHA NEWS

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు..

రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం,చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
ఈరోజు సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ మరియు ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వాహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అధికారులకు పలు సూచనలు చేశారు..

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ మహేంద్రకుమార్,దేవస్థాన ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ మరియు ఇతర అధికారులు,అర్చకులు,చెరువుగట్టు,ఎల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 02 07 at 5.01.02 PM

SAKSHITHA NEWS