SAKSHITHA NEWS

తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు.

లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పలు ప్రాంతాల్లో కుప్పపోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలి. ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్ప టికప్పుడు సమీ క్షించుకోవాలని, విద్యుత్‌, రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలి అని రేవంత్‌రెడ్డి సూచనలు చేశారు..

Whatsapp Image 2023 12 06 At 9.25.21 Am

SAKSHITHA NEWS