షాది తోఫ పథకం కు విధించిన ఆంక్షలను

Spread the love


Restrictions imposed on Shadi Tofa scheme

షాది తోఫ పథకం కు విధించిన ఆంక్షలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అద్యక్షులు ఫటాన్ రాజేష్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బి అర్ అంబేద్కర్ భవనంలో ముస్లిం మహిళల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

షాది తోఫ పదకంకు విధించిన ఆంక్షలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అద్యక్షులు ఫటాన్ రాజేష్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బి అర్ అంబేద్కర్ భవనంలో ముస్లిం మహిళల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రూ.50వేలు ఇచ్చారని మీరు అధికారంలోకి వచ్చన తరువాత రూ.1లక్ష లు ఇస్తని చెప్పి ముస్లిం మహిళలను మోసం చేశారని విమర్శించారు. వడువు, వరుడు 10వ తరగతి చదివి ఉందాలనడం విచారకరం అన్నారు.

ముస్లింలలో పదవతరగతి వరకు చవిన మహిళలు ఎంతమంది ఉంటారో ఆలోచించాలని పేర్కొన్నారు. ఆంక్షలను తొలగించి పేదలకు తప్పనిసరిగా రూ. 1లక్ష ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాంబాబు, దండు రేణుక, షేక్ మజుర్నిష, షేక్ బాజి, రేష్మ, ఫాతిమా, సాగర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page