చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది
ఆడపిల్లలు బాగా కష్టపడి చదవాలి
సాక్షిత : మహబూబ్ నగర్ పట్టణంలో గిరిజనుల అభివృద్ధి కోసం 15 కోట్ల 65 లక్షలతో వివిధ విద్యాసంస్థల నిర్మాణం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందని, ముఖ్యంగా ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ చదవాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
గురువారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం సమీపంలో కోటీ 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గిరిజనులు తరతరాలుగా గ్రామాలకు దూరంగా ఉంటూ తాగునీరు, రహదారి సౌకర్యాలు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డారని, కిలోమీటర్లు నడిచి వెళ్లి నెత్తిన బిందెలు పెట్టుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దామని, తండాల రూపురేఖలు మారిపోయాయని, అన్ని గ్రామాల మాదిరి వసతి సౌకర్యాలు కల్పించామని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ స్వరూపమే మారిపోయిందని పేర్కొన్నారు .అగ్రవర్ణాల పేదలకు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థులు, ఉద్యోగులు, యువత కోసం 15 కోట్ల 65 లక్షల రూపాయలతో వివిధ సంస్థలను నిర్మించామని, నాలుగు కోట్ల 20 లక్షలతో గిరిజన బాలికల పాఠశాలను నిర్మిస్తున్నామని, రెండు కోట్ల 70 లక్షలతో ఇటీవలే గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ప్రారంభించామని, మరో నాలుగు కోట్ల 20 లక్షలతో మహబూబ్నగర్లో గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంలో ఉందని, అంతేకాక జడ్చర్ల లో కూడా గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కోటి పది లక్షలతో నిర్మించిన గిరిజన భవనాన్ని ఇటీవలే ప్రారంభించుకున్నామని, దాని పక్కనే సేవాలాల్ మహారాజ్ భవనం కడుతున్నామని,ప్రత్యేకంగా దేవాలయం కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. దాంతోపాటు ఇప్పుడు కోటి 70 లక్షలతో నిర్మించుకొన్న ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించుకున్నామని వెల్లడించారు. హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్ లోనే గిరిజన భవన్ నిర్మించిన ఘనత తమదేనని తెలిపారు. జిల్లాలోని గిరిజనులు ఈ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని, అందరూ చదువుకోవాలని, ప్రత్యేకించి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని, చదువుకుంటేనే గౌరవం వస్తుందని తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రత్యేకించి మెస్ కోసం ఒక ఇన్చార్జిని నియమించాలని ,ప్రతి గిరిజన విద్యార్థిని గ్రూప్ వన్ తో పాటు, ఎస్ఐ ,కానిస్టేబుల్ శిక్షణ తీసుకోవాలని, కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేస్తామని, కంప్యూటర్ విద్య నేర్చుకోవాలని, ఒక లక్ష్యంతో కష్టపడి చదివి ముందుకెళ్లాలని అన్నారు. 15 కోట్ల రూపాయలతో పక్కనే ఉన్న జిల్లా స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తున్నామని గిరిజన విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి చత్రు నాయక్, మున్సిపల్ చైర్మన్ కె. సి .నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రామ్ లక్ష్మణ్, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, మోతీలాల్, లక్ష్మణ్ నాయక్, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్,
గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుజా నాయక్,
టీఎన్జీవోల జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రా నాయక్,
గిరిజన సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్
గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్,
నాయకులు కిషన్ పవార్, హరిచందర్ తదితరులు పాల్గొన్నారు.
[4:02 pm, 01/09/2022] BEERAM TEJOMURTHY: ……………..
చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…