రెజొనెన్స్‌ శ్రీనగర్‌లో 10 వ తరగతి విద్యార్ధుల వీడ్కోలు వేడుక

Spread the love

రెజొనెన్స్‌ శ్రీనగర్‌లో 10 వ తరగతి విద్యార్ధుల వీడ్కోలు వేడుకకు
“ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా అధనపు కలెక్టర్‌ యన్‌.మధుసూధన్‌

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని రెజొనెన్స్‌ స్కూల్‌ 10 వ తరగతి విద్యార్ధుల ‘‘వీడ్కోలు వేడుక’’ పిల్లల నృత్యాలు, ఆటపాటలు, కేరింతలతో గురువుల ఆశిస్సుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిధులుóగా యన్‌.మధుసూదన్‌, అధనపు జిల్లా కలెక్టర్‌, రెజొనెన్స్‌ స్కూల్‌ డైరెక్టర్స్‌ కొండా శ్రీధర్‌ రావు, కృష్ణవేణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు.


ఈ వేడుకలో యన్‌.మధుసూదన్‌, అధనపు జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్ధులు పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిల్లలలో స్పూర్తిని కలిగించే సందేశాన్ని ఇచ్చారు. విద్యార్ధుల పట్ల అంకిత భావంతో క్రమశిక్షణ కలిగిన విద్యార్ధులను భావిసమాజాన్ని నిర్మిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను, క్రమశిక్షణ, సాంకేతికత, సృజనాత్మకత, పఠనాసక్తి, శారీరక, మానసిక నైపుణ్యాల విషయంలో రాజీ పడకుండా విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ది ధ్యేయంగా పనిచేస్తున్న రెజొనెన్స్‌ మేనేజ్‌మెంట్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని తెలియజేశారు. ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అంటూ 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలతో ఎక్కువ 10 జి.పి.ఎ.లు సాధించాలంటూ ఆశిస్సులు అందించారు.

స్కూల్‌ డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు‘‘వీడ్కోలు’’ను అందిస్తున్న 9వ తరగతి విద్యార్ధులను అభినందిస్తూ 10వ తరగతి విద్యార్థులు చక్కటి ప్రణాళికతో చదవాలంటూ చక్కగా పరీక్షలకు సిద్దం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ ఉపాధ్యాయులు చెప్పే విషయాలను పరిశీలిస్తూ, తార్కిక ఆలోచనలతో జ్ఞానాన్ని పొందుతూ మంచి మార్కులతో అందరూ 10వ తరగతిలో మంచి జి.పి.ఎ.లను సాధించాలని కోరుకుంటూ ఆశీర్వదించారు. స్కూల్‌ డైరెక్టర్‌ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే తనలోని చెడు అలవాట్లకు వీడ్కోలు చెప్పాలని, తల్లిదండ్రుల మాటలను గౌరవించాలని చెప్పారు. 10వ తరగతి విద్యార్ధులు మంచి మార్కులు సాధించాలని వారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో ప్రధానోపాధ్యాయులు యం.ప్రసన్నరావు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు భోదనేతర సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొని విజయవంతం చేసారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page