అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన……….. జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
*సాక్షిత వనపర్తి :
జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలకు తక్షణం అవసరం ఉన్న మౌలిక వసతులపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ సుపర్వైజర్లను ఆదేశించారు.
మధ్యాహ్నం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సి.డి.పి. ఒ లు, సుపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడి భవనాల స్థితిగతులు, వాటికి తక్షణం కావల్సిన మౌలిక సదుపాయాల పై ఒక్కో ప్రాజెక్టు వారీగా సమీక్ష నిర్వహించారు.
స్వంత భవనాల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాల్లో తాగు నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా ఉండేవిధంగా చూడాలన్నారు.
ఆయా అంగన్వాడి భవనాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు మరుగుదొడ్లు, తాగు నీటి కొళాయి, కిచెన్ ప్లాట్ ఫారం, ఫ్లోరింగ్, ప్రహరీ గోడ, ఇతరత్రా మరమ్మతు పనుల అవసరాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా సి.డి పి. ఓ లను సూచించారు.
సి.డి.పి. ఒ లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.