సర్పన్ పల్లి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు

Spread the love

Repairs to Sarpan Pally Project drains

సర్పన్ పల్లి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టి, పంట పొలాలకు సాగు నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *”మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.

◆ సర్పన్ పల్లి ప్రాజెక్ట్ నుండి పంట పొలాలకు నీరందించే కాలువలు సరైన పద్దతిలో లేవని ప్రజలు తెలుపగా, ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్ట్ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని, తాత్కాలికమైనటువంటి మరమత్తులు కాకుండా, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

◆ గ్రామంలో కొన్ని కాలనీలకు థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, గ్రామంలోని పాత స్థంబాలను తొలగించాలని, పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, రైతుల కోరిక మేరకు ఓల్టేజ్ సమస్య ఉన్నందున పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు.

◆ గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1,11,21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.

◆ గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు మరియు పిచ్చిమొక్కలు తొలగించాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

◆ మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరి చేసి, గ్రామ ప్రజలకు సరిపడేలా గేట్ వాల్వ్ ఏర్పాటు చేయాలని, 8వ వార్డు ప్రజలకు సరిపడా నీరు అందించాలని, ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

◆ గ్రామంలోని అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.

◆ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page