ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించండి : మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి

Spread the love

సాక్షిత : తిరుపతి మునిసిపల్ పరిధిలో ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించేందుకు వెనుకాడరాదని అధికారుల‌నుద్దేసించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణలు ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మేయర్, కమిషనర్ తో మాట్లాడుతూ గోవింధరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నందు యు.డి.ఎస్ ఓవర్ ప్లో అవుతున్నదని, అదేవిధంగా ఎస్టివి నగర్లో కాలువ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని, కాలువలపై స్లాబులు వేయాలని చెప్పడంతో, మేయర్, కమిషనర్ స్పందిస్తూ ఆ పనులను పరిశిలించి పూర్తిచేయాలని ఆదికారులకు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ఓక పిర్యాదులో ఉప్పంగి హరిజనవాడ వద్ద రోడ్డుపైన స్థలాన్ని ఆక్రమించి షాప్ నిర్మించారని, దీని వలన వాహనదారులకు, నడిచే వారికి అసౌకర్యంగా వుందనే పిర్యాదుపై స్పందిస్తూ తక్షణమే ఆ షాపును అక్కడి నుండి తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తూ నగరంలో ఎక్కడైన ప్రజలకు ఇబ్బందులు కల్గించే విషయాలపై కఠినంగ వ్యవహరించాలన్నారు.

దాసరిమఠం ప్రాంతంలో రెండు చింతచెట్లు కరెంట్ తీగలపై కూలిపోయి వున్నాయని, వాటిని తొలగించమని, ఆర్.సి రోడ్డు నందు కరెంట్ స్థంబాలు పడిపోయి లైట్లు వెలగడం లేదని, గొల్లవానిగుంటలో 60 అడుగుల రోడ్ వేసారని కానీ కాలువలు నిర్మించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, నెహ్రూ నగర్లో యూడిఎస్ బ్లాక్ వలన మురికి నీరు వెల్లి మంచినీటి బావుల్లో కలుస్తున్నాయని, గొల్లవానిగుంట రాజీవ్ నగర్ నందు వీదిలైట్లు, కాలువలు, రోడ్లు నిర్మించాలని, రైతుబాజారు ముందర ఆక్రమణలు లేకుండా చేయాలనే పిర్యాదులపై మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి స్పందిస్తూ సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ ఆయా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, దేవిక, గోమతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page